#376

దైవసహాయము కొరకు ప్రార్థన

రాగం: నాథనామక్రియ (చేయ: యెహోవా భజన) · తాళం: అట · రచయిత: మిక్కిలి దైవసహాయము

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవా సహాయము నిమ్మా – జీవంపుటూటలు ద్రావుట కిమ్మా || దేవా ||
చరణము 1
గడియ గడియకు నెగసె నమ్ము – లెంతో – వడిగా నాపై వచ్చె నరక బాణములు –యెగతెగని శోధనములు నీవు – పడగొట్టి వేగమే – దృఢభక్తి నిమ్మా || దేవా ||
చరణము 2
కోటానకోటి కష్టములు – నాకు – మాటిమాటికి వచ్చె మరి నికృష్టములుసాతాను సాధనములు – నేను – దాటి నీ రెక్కల – చాటున నుండ || దేవా ||
చరణము 3
దారా పుత్రుల పైన భ్రమలు – నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములుఘోరముగు నాత్మకములు – న – హ్నిన్ని రీతి భ్రమ పెట్టు ధారుణిలోన || దేవా ||
చరణము 4
మా యావత్ దినములు – చెట్టు – ఛాయవలె నరుగుచు మంటి పాలౌను – చాలు నీ లోకంబు మేలు – మేము – పరలోకరాజ్యము – చేరుట మేలు || దేవా ||
చరణము 5
మంచి మరణం బిమ్ము దేవ – మమ్ము – వంచించు – సాతాను వల నుండి కావ నెంచి దూతలను పంపినావా – మాకై – పంచ గాయములొంద – ప్రభు వచ్చినావా || దేవా ||