#375

కృప కొరకు ప్రార్థన

రాగం: శ్రీరాగము (చేయ: కలుగునుగాక దేవునికి మహిమ) · తాళం: అట · రచయిత: పులిపాక జగన్నాధము

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నా యఘములు అన్నియు – నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే – నీ సుతుని కృతమున || నాలించు ||
చరణము 1
నీ యాజ్ఞ లన్నియు – నేను చక్కగ సల్ప – నీ యందు నమ్మిక – నెగడించుమనిశంబు || నాలించు ||
చరణము 2
నీ సేవ నొనరింప – నిండుగ నిలలోన – నీ సేవకుని కమ్ము – నీ శుద్ధాత్మను కృపచే || నాలించు ||