#374
ప్రభు ప్రార్థన
పల్లవి · Pallavi
పరము నందుండెడు మా – పరమ జనక నీదు పేరుపరిశుద్ధంబగును గాక – త్వరగను నీ రాజ్యంబు – ధరకునే రుగుదెంచుగాకపరమునందు నెట్టులనో – ధరణియందు నట్లు నీ చి – త్తంబు నెరవేరుగాక || పరము ||
చరణము 1
మా యనుదినాహారము – మాకు నేడు దయచేయుము – మా యెడలను దప్పిదముల – జేయువారి నైచునటులమాయపరాధము క్షమించి – మమ్ము శోధనలోకి దేక – మహిని గీడు నుండి నీ స – హాయమున దప్పించుము రా – జ్యమ్ము శక్తి మహిమము నె – ల్లప్పుడును నీవే యామెన్ || పరము ||