#368
క్రైస్తవుని విజయము
పల్లవి · Pallavi
భయము మేల క్రైస్తవుండా – నీవికనపజయమున బ్రతుకనేలజయ శూరుడగు ప్రభువు – ఇలనీకు జయము నిచ్చుచునుండగ || భయము ||
చరణము 1
భూతపీడితుల నెల్ల – విడిపించుదాత – మన రక్షకుడు – సాతాను వల నుండియు – విడిపించినీతితో మనుపలేదా || భయము ||
చరణము 2
మరణ పాశముల నుండి – లాజరును – కరుణతో లేపలేదా – ధరణి మిమ్ముల నూతన –బలముతో – గురికి నడిపించలేదా || భయము ||
చరణము 3
ద్రాక్షారసముగా నీళ్ళను – మార్చిన – మహిమగల రక్షకుడు – అక్షయ సంతసంబు – నిలమీకుదీక్షతో నివ్వలేదా || భయము ||
చరణము 4
ఐదు చిన్న రొట్టెలు – మరి రెండు – చిన్న చేపలతోడును – ఐదు వేల మందిని –బలపరిచినట్టి రక్షకుడుండగ || భయము ||
చరణము 5
విజయకరముగా బ్రతుకను – ప్రభువుండు – నిజవాగ్దత్తము లివ్వ నీ –మృజినము గెలువంగను – ముదముతో నిజముగా నెరవేర్చడా || భయము ||