#366
క్రీస్తు మనల నెన్నడు విడువడు
చరణము 1
నాథా! ఈదలేను ఈ ప్రవాహమునన్ – నీ దరిన్ గాన నీ కెరటాలదాటిచే – నావికా రమ్ము నన్ బ్రోవుము
చరణము 2
స్వామీ! నీదు ప్రేమకు నే సాక్షిని – సంఘమందున నా పొరుగువారికి నీ – సత్య సువార్త నే చాటుదునన్
చరణము 3
రాజా! నీదు రాజ్యములో జేరితి – రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము – రక్షణానందము గూర్చుము