#365
క్రైస్తవ యుద్ధ ప్రేరణము
పల్లవి · Pallavi
లేలేమ్ము క్రైస్తవుడా – నీలో మేల్కొనిలేలేమ్ము క్రైస్తవుడా – నీలో మేల్కొని || లేలేమ్ము ||
చరణము 1
విడువకు యుద్ధము – నుడువకు కపటము – యెడయకుండ నీకడ – నుండును బాయడు || లేలేమ్ము ||
చరణము 2
విడువకు ధైర్యము – వదలకు కవచము – సదయుడు క్రీస్తుడు – సత్ఫల మిచ్చును || లేలేమ్ము ||
చరణము 3
బెదరకు మేరికి – వదలకు దారిని – నది యిది కానిది – యాత్మను బెట్టక || లేలేమ్ము ||
చరణము 4
ప్రార్థన సారము – వర్ధిల్ల గోరుము – సార్థక కాలము – వ్యర్థము చేయక || లేలేమ్ము ||
చరణము 5
భావములోనన్ – దేవుని ప్రేమలన్ – నీవది వేడుచు – నెమ్మది గూడుచు || లేలేమ్ము ||
చరణము 6
యేసుని సిలువ – నెదుట బెట్టుకో – మోసము నొందవు – యేసుని కాపున || లేలేమ్ము ||