చరణము 1
సర్వాద్భుతంబులవలె సర్వత్ర చాటించుకర్తవైన సర్వాత్మలంతట శ్లాఘింపజేరరండి! మా రాకపోకలన్ మమ్మువీడకుండను మా రక్షకుడిట్లే మమ్మాదరించును.
చరణము 2
మహా దయాళుడే మా జీవకాలమంతసహాయమూర్తియై సంతోషమిచ్చుగాక!మహత్తు ప్రేమను మాయందు నుంచునుఇహంబునన్ మమ్ము నెన్నడు బ్రోచును.
చరణము 3
ప్రపంచపాలకా! ప్రసిద్ధుడైన తండ్రీ!సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మా!సంపూర్ణ త్రేకుడా! ప్రఖ్యాతికలగగాఅపారసన్నుతి నర్పింతు సర్వదా.