#359

క్రైస్తవ వీరులు

రాగం: శంకరాభరణము · తాళం: ఏక · రచయిత: ఎ. జెకర్యా

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
వీరులమయ్యా – జయ – వీరులమయ్యా – మావైరిన్ జంప యుద్ధమాడు – శూరులమయ్యా || వీరుల ||
చరణము 1
మాంస లోక పిశాచి – హింసపరచిన – మమ్ముధ్వంసము చేయ పైబడిన – ధ్వజము విడువమయ్యా || వీరుల ||
చరణము 2
పరమ గురువు అగు – యేసు – ప్రభువు నాజ్ఞను – బహుత్వరగా ప్రజకు బయలుపరచు – భటుల మేముమయ్యా || వీరుల ||
చరణము 3
అతి దుష్ట ద్రోహులు – మమ్ము – వెడల బెట్టిన – నీస్తుతి సువార్త కొరకు కొంచెం – సిగ్గుపడమయ్యా || వీరుల ||
చరణము 4
భూలోక నాధులు – చాల – పోరు సల్పిన – మావేలుపునకు ప్రాణమైన – బెట్టువారము || వీరుల ||