#358
క్రైస్తవ మను యుద్ధము
పల్లవి · Pallavi
సిలువ సైనికులారా – నిలువండి వడి లేచిబలుడు యేసు క్రీస్తు – ప్రభు దయ జయమౌను || సిలువ ||
చరణము 1
రారాజు పంపున – రణము సేయగ బూనిధీరులై నిలువండి – దినము శత్రుల గెల్వ || సిలువ ||
చరణము 2
అతడు నిజ ధ్వజ – మత్యున్నతి నొందబ్రతుకు వీరుని గెల్చు – వరకు సేనల నడుపు || సిలువ ||
చరణము 3
మీ స్వీయ బలమున – మీ రానుకొనకయేమీ స్వామి బలమును – మీరు నమ్మి గెల్వ || సిలువ ||
చరణము 4
శత సహస్రము లైన – శత్రుల నెదిరించిసతతము ప్రభు సేవ – సల్పి ధైర్యము నొంది || సిలువ ||
చరణము 5
దేవుడొసగినట్టి – దివ్య కవచము దాల్చిభావ ప్రార్థనాసి – బట్టి యుద్ధము సేయ || సిలువ ||
చరణము 6
జయశీలు రగువారు – చారు కిరీట మందిజయశాలి క్రీస్తు దయ – జనెదరు సద్గతికి || సిలువ ||