#357
మనోసాక్ష్యానందము
పల్లవి · Pallavi
ఇతరుల సాక్ష్యము – లెంతొ గలిగియున్న – మరి సాక్ష్యమే మందడిమృతి బొంది లేచియున్న – త్త మోక్ష రాజ్యాధి – పతియై యున్న యేసు – ప్రభువే మా విభుడైన || నితరుల ||
చరణము 1
గురి సిలువ దెస మాకు – స్థిరమై నిలిచియున్న – దురితము తల యెత్తినేమరి యేసు ప్రక్కలో – చొరబారి యందున్న – కరుణారసము గ్రోలు – టెరిగి యుండిన చాలు || నితరుల ||
చరణము 2
తలవాల్చుటకు తనకు – స్థలము లేదనునట్టి – పలుకే మా కైశ్వర్యముబలమిచ్చి యెదిగించు – ప్రభు వాగ్దత్తములే – మా – కలిలో పంచభక్ష్య – ములుగా నుండిన చాలు || నితరుల ||
చరణము 3
బెదిరించి సైతాను – కదలింపలేనట్టి – కుదురైన విశ్వాసముబొదలుచు మాలో నిం – పొదవుచుండిన చాలు – మదిలో నెమ్మది యిచ్చు – మా యేసు కృప గల్గ || నితరుల ||