#356

క్రైస్తవ సాక్ష్యము

రాగం: హిందూస్తాని ముఖారి · తాళం: జుల్వ · రచయిత: మల్లెల దావీదు

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సాక్ష్య మిచ్చెద – మన స్వామి యేసు దేవుండంచుసాక్ష్య మనగా గనిన వినిన – సంగతులను దెల్పుటయేసాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు || సాక్ష్యమి ||
చరణము 1
దిక్కు దెసయు లేని నన్ను – దేవుడెంతొ కనికరించిమక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడో || సాక్ష్యమి ||
చరణము 2
పల్లెటూళ్ళ జనుల రక్షణ – భారము నాపైని గలదుపిల్లలకును పెద్దలకును – ప్రేమతో నా స్వానుభవము || సాక్ష్యమి ||
చరణము 3
బోధ చేయలేను వాద – ములకు బోను నాక దేలనాధుడు యేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసినంత వరకు || సాక్ష్యమి ||
చరణము 4
పాపులకును మిత్రుడంచు – ప్రాణ మొసగి లేచె నంచుభావముల క్షమించు నంచు – ప్రభుని విశ్వసించుడంచు || సాక్ష్యమి ||
చరణము 5
చోరులైన జారులైన చారులైన నెవ్వరైనఘోరపాపులైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు || సాక్ష్యమి ||
చరణము 6
పరమత దూషణము లేల – పరిహసించి పలుకుటెలఇరుగు పొరుగు వారికెల్ల – యేసు క్రీస్తు దేవుండంచు || సాక్ష్యమి ||
చరణము 7
ఎల్లకాల మూర్ఖుడనై – నేల యాత్మ శాంతి లేకతల్లడిల్లు వారలకును – తండ్రి కుమార రాత్యాత్మ పేర || సాక్ష్యమి ||