#360
క్రైస్తవ లక్షణము
పల్లవి · Pallavi
యేసు క్రీస్తు మతస్థుడననగా – నెరిగి మనుడి జగము లోపలవాసిగా ప్రభు యేసు దాసులే – పరమందు నివాసులగుదురు || యేసు ||
చరణము 1
యేసు క్రీస్తును నమ్మి యాయన – దాసుడై వర్తించు నాతడెభాసురంబుగా క్రైస్తవుండని – ప్రాకటంబుగా బరగుచుండును || యేసు ||
చరణము 2
ఎల్ల సమయములందు ధాత్రిని – యేసు నడతల నెరిగి నడుచుచునుల్లమున రక్షకుని దాల్చిన – యోర్పరియే క్రైస్తవుడు సుమ్ము || యేసు ||
చరణము 3
క్రీస్తు నన్ను గొనెను గావున – క్రీస్తువాడను నేను అంచునుక్రైస్తవుండు గొల్చు నాతని – వాస్తవమ్ముగా నాత్మ తనువుల || యేసు ||
చరణము 4
రాజులు యాజకులు శుద్ధులు – రాజనందను లనెడు పేళ్ళనురాజరాజు దేవుడొసగెను – రాజితంబు క్రైస్తవులకును || యేసు ||
చరణము 5
క్షయము లేనిది శుద్ధమైనది – వ్యయము లేనిది నిత్యమైనదిదయను యేసుడొసంగు భాగ్యము – తప్పకుండా క్రైస్తవులకును || యేసు ||