#353

క్రీస్తుని పోలియుందును

రాగం: బేహాగ్ (ఛాయ: ఇదిగో నీతి భాస్కరుండు) · తాళం: ఏక · రచయిత: సి. రవివర్మ

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నేను క్రీస్తు ప్రభుని జేరి – నేను క్రీస్తువాడ నౌదునేను క్రీస్తు సొత్తుగాన – నేను నా సమస్తమును – నాధుడు యేసు కిపుడు రిత్తు || నేను ||
చరణము 1
నేను క్రీస్తు ననుభవించి – నేను క్రీస్తు పోలియుందునేను నా స్వరూపమందు – నా ప్రభుండు గానుపింప – నేను నేసులో వసింతు || నేను ||
చరణము 2
నేను క్రీస్తు నందునుండి – నేను క్రీస్తులో బెరుగుదునేను క్రీస్తు దారినడచి – నేను క్రీస్తు మనసు నెపుడు – గానుపరతు నెల్లెడను || నేను ||
చరణము 3
నేను క్రీస్తు సేవచేసి – నేను క్రీస్తు సాక్షినౌదునేను క్రీస్తు సాధనంబే – నేను యనుభవించు రక్ష – ణానందంబు చాటెద నెపుడు || నేను ||
చరణము 4
నేను ప్రాణమైన నిచ్చి – నేను క్రీస్తుకై బ్రతుకుదునేను, క్రీస్తు కలిసియున్న – నాశనమ తన యని శక్తి – నేలగాలు నద్భుతముగ || నేను ||