#352
యేసు నా రక్షకుడు
పల్లవి · Pallavi
వెలుగును రక్షణకర్తయు నగునా – బలమగు దేవుని స్తోత్రింతునువెరువను నేనిక నెవరికిన్ – వెలుగైన యేసే నా దుర్గము || వెలుగును ||
చరణము 1
అగాధ చీకటి జలముల నుండి – అఖండమైన వెలుగు సృజించినయుగయుగంబుల నేలెడి ప్రభువు – అఘములను బాపి నన్ను వెలిగించును || వెలుగును ||
చరణము 2
నా దీపమును వెలిగించు ప్రభువే – నా దరి చీకటిన్ వెలుగుగ మార్చునునా దోషము లెల్లను దన కాంతిలో – నాదరముగా గడిగి రక్షించును || వెలుగును ||
చరణము 3
పలువిధ శోధనల్ నన్ను చుట్టినను – విలువగు సంపద లంతరించిననువెలుగు దాత నాపై యురులొడ్డెడి – నలయక నిత్యము నడిచెద వెలుగులో || వెలుగును ||
చరణము 4
తల్లిదండ్రులు విడిచినగాని – యులము విడి భయమందినను ఎల్లప్రజలు నన్ను ద్వేషించినను – ఎడబాయడు నా ప్రియుడగు యేసు || వెలుగును ||
చరణము 5
క్రీస్తు యేసుడే లోకపు వెలుగని – వాస్తవముగా గనుడి ప్రియులారాశాశ్వతంబగు రాజ్యము చేర – సత్వరమాయన వెలుగును బొందెదరు || వెలుగును ||