#351
యేసే రక్షకుడు
పల్లవి · Pallavi
నీ కన్న నిక వేరే – వేల్పులు లేరయ్యా – నిజముగా నా యేసువానీ కరుణ యను నెనరుచేతను – నీదు సత్య సువార్త ద్వార – ప్రాకటంబుగానన్ను పిలిచిన – లోక రక్షక నీకు మ్రొక్కెద || నీ కన్న ||
చరణము 1
నిన్ను తెలియక మున్ను – నన్య దైవంబుల – ననుసరించిన పాపములన్ని పెనగొని నాదు హృదయపు – గన్ను గ్రమ్మి ప్రకాశ మియ్యక –యున్న నీ విమలాత్మ వరమున – నన్ను వెలిగించిన దయానిధి || నీ కన్న ||
చరణము 2
వదలక నే జేయు – తుద లేని పాపము – వదలించి నను బ్రోచితితుది దినంబున గలుగు బాధలు దొలగ జేయుట నీవ యని నాహృదయమందున నా నిరీక్షణ – పదిలపరచిన భక్త పాలక || నీ కన్న ||
చరణము 3
నీ వాక్యార్థము నాలో – నివసింపజేసి నీ – సేవకునిగా బ్రోవవేనీవే సత్యము నీవే జీవము – నీవే మార్గము నీవే ద్వారము –నీవు గాకింక నెవరు లేరు - కావవే నన్ను యేసు నాయక || నీ కన్న ||