#350
రక్షణ పొందిన పాపి
పల్లవి · Pallavi
నా యేసు! నా యాత్మ బలమా! – నీదు గాయంబులే నిలువదగిన స్థలముసకల సృష్టి పునాదియప్పుడే – నాదు సకల పాపములకై బలియైతి వేసు!సకల భూమ్యాకాశములను – సమముగా గతించినగాని నీ ప్రేమ నిలుచు || నా ||
చరణము 1
నా తండ్రి! నీ నిత్య కృపను – నెంచ నా తరమా? నీ ప్రేమ హస్తములు ఈచిపాతకులం రండంచు బిలిచి – వేగ నీదు కృప రుచి జూపి జీవంబు నిచ్చు || నా ||
చరణము 2
దరిలేని లోతైన ప్రేమా! – నీలో – దురిత మెల్లను మునిగి పోవుదరిలేని యుచిత కృప చాటు – నీదు – రక్తంబు నా పాపదాగులను గడిగె || నా ||
చరణము 3
ఈ ప్రేమ సాగరంబున నే – దుమికి – నా ప్రభుని యెదదూరి విశ్రాంతి నొందిఏప్రొద్దు సంతసింతును – నన్ను – నా ప్రాణమును డాయదిక నరక మొందు || నా ||
చరణము 4
నా శిరముపై నలలెరిగి – యిలను – నా సత్తువయు స్నేహితులు నన్ను వీడినా సుఖము నా సంతసమును – బోయి – నన్ను నీదు కృప నన్ను విడిపోదు తండ్రి || నా ||
చరణము 5
నా హృదయమే నిలిచిపోనీ – నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీధర పునాదులే కరిగిపోనీ – యేసు – నిరంతరము నీ ప్రేమ నిలుచు నన్ను బ్రోచు || నా ||