#349

రక్షణానందము

రాగం: కల్యాణి (చేయ: ఎంతో సుందరమైనవి) · తాళం: త్రిపుట · రచయిత: యు.ఎ. భాసిలామణి

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సంతోషింపరే ప్రియులారా – యేసుని చెంతసంతసింపరే మనసార – ఎంతో ప్రేమించి యనంతడుసగెను సుతునివింతగ బ్రతుకవ సంత శోభను దాల్చే – అంతరంగములో వసించినచింత లెల్లను వాడబారెను –గంతులిడుచును నూత్నజీవ పూవుల – తాంతములు పూయందొడగెను || సంతో ||
చరణము 1
సిలువలో వలారిన – యేసునిప్రేమ – ఫలియించె హృది వనమునకలుష మెల్లను బాపు – కల్వరిలో భక్తి – పలవులు చిగురించిచెలుని పాద పద్మములు – అలుముకొని యారాధనంబున – మలయమారుతగలికల పై మలపు గొనుచు సమర్పణంబును – సులలితముగా జేయ దొడగెను || సంతో ||
చరణము 2
పాపతాపము తొలగెను – జీవితపు తుఫానులన్నియు నణగెనుప్రాచీన సర్పము – పగబట్టి పడగెత్తి – పంతమున నన్నుడాసి – పట్టువున కూలవంగపాప మరణపు విరుగుడగునా – ప్రభుని యమృత రక్తసారము –ప్రాణ భిక్షను బెట్టెను మరి – పగతుని యోడించెను హాహా || సంతో ||
చరణము 3
యాత్రాపదమున యేసుడు – ప్రకాశింప రాత్రియే పగలాయెనునేత్రములు వికసింప – ధాత్రి నా బసలోప – విచిత్ర వాక్యములో విచిత్ర కృపలను గాంచిగాత్ర వీణను మీటి దేవుని – స్తోత్ర గీతము పాడి పుణ్య – క్షేత్రపధమున బోవ యేసుడు – మిత్రుడై నడిపింప దొడగెను || సంతో ||
చరణము 4
సరిసంపదలు యున్నను – లేకున్నను – కరుణావరములు తరుగవుపైరు పంటలు గాని – పరువు ప్రతిష్టలు – కరుణ వంతవు నైన గాని నే – మురియుదుమదిలోన – గిరులపై నరుగులిడుటకు హరిణ పాదము లొసగె యేసుడువెరతునా చింతింతునా కలువరిని ప్రేమలు కురియుచుండగ || సంతో ||