#348
క్రీస్తునందలి నా యానందము
పల్లవి · Pallavi
నా కింత ప్రోత్సాహ – నందంబుల్ గలుగుటకే కర్త ఘనమైన – హేతువై యుండునాకు గల యున్నత – కృతత్వమే నాధుడునగును నేను మురియు – నాకరంబగు నామమేది సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
చరణము 1
ఎవరు నా భక్తికి – హితమైనట్టి పునాదియెవరు నా కంఠంబు – నెత్తెన్ పాటలతోఎవరు నా పాపముల – భారము నెత్తుకొని దేవునికినాకును – చివరకున్ స్నేహంబు కలిపిరి – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
చరణము 2
నేను నా విధులెల్ల – నిశ్చయంబుగ నెరుగ – జ్ఞాన మిచ్చుచునుండుజ్ఞాని యెవ్వారు – వాని యెడల నన్ను యధార్థ –పరునిగా గావించి యవినా – చే నెరవేర్పించు నెవరు – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
చరణము 3
ఎవరు నా శత్రువు – నెదిరించి గెల్చిరి – యెవరు నా శోకంబు – నెగరు గొట్టిరిఎవరు నా హృదయంపు మూర్ఛను – నీడ్చి సేదను దీర్చి మనసు –చివుకుమను గాయంబు మానిపిరి – సిలువబడ్డ యేసు క్రీస్తే || నా కింత ||
చరణము 4
మరణంబులో నాకు – స్థిరజీవ మెవ్వారు – మరణంబునకె గొప్ప మరణమెవ్వారు – విరివిలేని మహిమ సేలు – దరిని నుండగ నన్నున్ జేతనుస్థిరముగ స్థాపించు నెవరు – సిలువబడ్డ యేసుక్రీస్తే || నా కింత ||
చరణము 5
నన్ను రక్షింప మరణం బొందియు సమాధి – నేన్నటికిని గెల్చి – యున్నప్రభునందు – నున్న విశ్వాసంబే నాకు – నుత్తమంబునుగలుగజేయును – చెన్నగు నా ప్రభువు కింక నెవ్వరు – సిలువ బడ్డ యేసు క్రీస్తే || నా కింత ||