#347
నిత్యజీవానందము
పల్లవి · Pallavi
ఆనందమగు ముక్తి – యే నా మందిరముజాని మానగ నచ్చు – దాని సుందరము || ఆనందమగు ||
చరణము 1
పరదేశి వలె దేహ – వరణమందుందున్ధరణి కాననముగా – దర్శించుచుందున్నెరిదుఃఖ సుఖములు – సరిగా భావింతున్పరిశుద్ధాత్మని వేడి – పరితృప్తి నొందు || నానందమగు ||
చరణము 2
బహు శోధనలు నాపై – బడి వచ్చునప్పుడునహితాంధతమమునన్ – నల్లుకొనినప్పుడునిహ బాధలన్నిన – నెదిరించినప్పుడునహహా యేసునివల్ల – నమృతుడ నెప్పుడు || నానందమగు ||
చరణము 3
ముందు నా మనసు దేవుని కప్పగింతునందరి నస్మత్తుల్యముగా ప్రేమించుతున్సందేహ రాహిత్య సరణిలో నిలుతున్పొంద బోయెడి ముక్తి భువి యందె గాంతు || నానందమగు ||