#344

నూతన జన్మము

రాగం: శంకరాభరణము · తాళం: ఏక · రచయిత: తూపిలి రంగయ్య

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరమ రాజ్యమునకు నరులు – తిరిగి పుట్టవలయు ననుచున్వరము గురువు యేసు క్రీస్తు – స్థిరము చేసెను || పరమ ||
చరణము 1
వేదశాస్త్ర మెరిగినట్టి – యూదుల యధికారియౌ నికోదే మనెడు పరిసయ్యుండు – మదిని దలచుచున్ || పరమ ||
చరణము 2
అతడు రాత్రివేళ ప్రభుని – వెదకి పోయి యెదుట సమ్మతిని నిలిచి పిలిచి పల్కె – హితువుతోడను || పరమ ||
చరణము 3
బోధకుండ నీవు మోక్ష – నాధుడౌ యెహోవ యొక్కవేద వార్త జెప్పెదవు నీ – బోధ నెరుగుదున్ || పరమ ||
చరణము 4
మరియు నీవు చేయుచున్న – గురుతు లెవ్వరైన దైవవరము లేని యట్టి పాప – నరులు చేయరు || పరమ ||
చరణము 5
అనుచున్ పరిసయ్యుండు పల్క – వినుచు యేసు కనికరమునన్దనకు నిట్లు దెలిపెన్ జాలి – మనసుతోడను || పరమ ||
చరణము 6
క్రొత్త జన్మ మెవ్వడైన – నెత్త కున్న మోక్షమునకునెత్తబడడటంచు నిజము – క్రీస్తు పల్కెను || పరమ ||
చరణము 7
వినుచున్ పరిసయ్యుండు ముసలి – జనుడు మరల తల్లి గర్భమునను తిరిగి యెట్లు బుట్టు – ననుచున్ బల్కెను || పరమ ||
చరణము 8
అందుకేసు దెల్పె జలము – నందు నాత్మయందు జన్మమొంద కున్న మోక్ష రాజ్య – మొంద రనుచును || పరమ ||