చరణము 1
సర్వేశా! రమ్ము నీసన్నిధి కాంతి నొసంగుమాకు సత్య సనాతనసర్వాధికారుడా సదామమ్మెలుము సర్వోన్నతా!
చరణము 2
నిత్యంపు వాక్యమా!నీదగు ఖడ్గము నిమ్ము మాకునీ నిజ భక్తులనునీ వాక్య ప్రియులను నింపునీ యాత్మతో నింపుమీరా.
చరణము 3
రమ్ము మహాత్మా! మాకమ్ము నీ యాత్మను రమ్మువేగ రక్తితో నిప్పుడు రమ్ముమా మధ్యకు రక్షించు మమ్మునురంజిల్లగా.
చరణము 4
స్తోత్రం పవిత్రుడా!స్తోత్రంబు త్రేకుండా!స్తోత్రం సదా ధాత్రి నీమహిమనేత్రంబులు గనమీ, "త్రాహిమాం" యనివేడువారికి.