#33
Before Jehovah's Throne
చరణము 1
యెహోవా గద్దె ముందటజనంబులారా మ్రొక్కండియెహోవా దేవుడు సుమీసృజింప జంప కర్తయె.
చరణము 2
స్వశక్తిచేత నాయనేమమ్మున్ సృజించె మంటిచేభ్రమించు గొర్రె రీతిగాదప్పంగ మళ్ళీ చేర్చెను.
చరణము 3
సుకీర్తి పాడి గుంపులైప్రసిద్ధి గన్న జగత్తువేరు నోళ్లతో స్తుతించుదివ్యమౌ ధ్వనితో.
చరణము 4
ప్రభుత్త్వముండు నంతకునీ ప్రేమ నిత్యము చిరంబునీదు సత్యము వసించునెల్లకాలము.