#32

అర్పణ కీర్తన (దావీదు కీర్తన 51:16-19)

రాగం: హిందూస్థానీ తోడి (ఛాయ: ఆహా ఎంతటి శ్రమలు) · తాళం: త్రిపుట · రచయిత: మల్లెల దావీదు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
దహనబలి నీకు నష్టము మరియు దైవబలులు విరిగిన యాత్మయేయెహోవా దేవ విరిగినలిగిన యట్టి హృదయము లక్ష్యంబు సేయుదువు ॥దహనబలి॥
చరణము 1
నీ కటాక్షముతో సీయోనును నిప్పుడే నెనరుతోడను మేలు చేయుమిప్రాకటంబుగాను యెరూషలేమునకు బ్రాకారములను గట్టించుమి ॥దహనబలి॥
చరణము 2
అంతట నీతియుక్తంబులౌ బలుల యాగముల సర్వాంగహోమముల్ఎంతో ఇష్టమౌ బలిపీఠము మీద నెన్నో కోడెలు జనులర్పింతురు ॥దహనబలి॥