#31
ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
చరణము 1
ఓ ప్రభుండా నిన్ నుతించుచున్నాము వినయముతోడమా ప్రభుండవంచు నిన్ను మానకమే మొప్పుకొందుము ॥ఓ ప్రభుండా॥
చరణము 2
నిత్యుండౌ తండ్రి లోకము నిన్నారాధించుచునుండుసత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ ॥ఓ ప్రభుండా॥
చరణము 3
నిత్యమేక కంఠరవముతోడ నిన్ గొనియాడుచున్నారుపరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ సేనల దేవాధరణి పరలోకంబులు నీ వర మహిమతో నొప్పునంటంచు ॥ఓ ప్రభుండా॥
చరణము 4
కెరూబుల్ సెరాపుల్ నిన్ను గీర్తించుచున్నారుసారెకు నిన్ అపొస్తలుల సంఘము స్తోత్రించుచుండుకూరిమి ప్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ॥ఓ ప్రభుండా॥
చరణము 5
మా మహా జనకా నిన్ను మాన్యుడౌ పుత్రునిబహు ప్రేమగల ఆదరణకర్తయైనట్టి శుద్ధాత్మనినంతటనుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభు ॥ఓ ప్రభుండా॥
చరణము 6
నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుడవునీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుముపావనంబౌ నీ రక్తమున సేవకులకు దోడ్పడుమిప్పుడు ॥ఓ ప్రభుండా॥
చరణము 7
నిత్య మహిమములో నిక నీదు భక్తులతోసత్యముగా లెక్కింపుము వారల గని రక్షింపుమి నీ సుజనంబును ॥ఓ ప్రభుండా॥
చరణము 8
నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడివారల బాలించి లేవనెత్తుము సతతము ప్రీతిన్ ॥ఓ ప్రభుండా॥
చరణము 9
ఓ ప్రభువా పాపములో నుండకుండగ దోడ్పడుముమా ప్రభువా కరుణించు మము గరుణించుము దయతోడన్ ॥ఓ ప్రభుండా॥
చరణము 10
ఓ प्रभुండా నిన్ను నమ్మియున్న మాకు బ్రేము జూపుశ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొందనీయకుము ॥ఓ ప్రభుండా॥