#328

పశ్చాత్తాపము లేనిదే పరమ భాగ్యము లేదు

రాగం: అసావేరి · తాళం: ఆట · రచయిత: వి. వెంకటస్వామి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పాప పశ్చాత్తాప మొందని వానికి – పరమ భాగ్య మేడ లబ్బునే – మనసా – పాపాత్ములకు యేసు – పరమండలము నుండి భూమధ్యమునకు – దయవచ్చెను పాపిష్టుల రమ్మని పిలిచెను – నా – ప్రాపు కోరుమని చెప్పెను – మనసా ॥పాప॥
చరణము 1
ధైర్యమొంది నన్ను దలచిన వారికి – పూర్వజ్ఞానమొనగూర్తును – దౌర్భాగ్యమెల్లను విడనాడుదును – యేసు – వారి యాజ్ఞ యని యనియెను – మనసా ॥పాప॥
చరణము 2
బలపడిన నాదు నామము గొన్నవారికి – ఇల బాంధవుల వైరుల యందును – సర్వ – కుల జనంబుల క్రోధమందున – స్నేహి – తుల యెడబాటులు గలుగును – మనసా ॥పాప॥
చరణము 3
అడిగిన వారికి నొసంగుదు ననుచును – కడు మోదమున నాజ్ఞాపించెను – తట్టు – తట్టుడని బోధించెను – విప్పి – విడబడునని ప్రేమించెను – మనసా ॥పాప॥
చరణము 4
దోషము లన్నియు యేసు నాథుడు తా – మోసికొని సమ్మతించెను – సిలువ – వేసిన వారిని దీవించెను – మోక్ష – వాస సాధనమని తెల్పెను – మనసా ॥పాప॥