#327
పశ్చాత్తాప తిథి
పల్లవి · Pallavi
దేవ నీవు నన్ను బరిశో – ధించి బాగుగా దెలిసికొంటివి – నీ వెరవుదువు నేను కూర్చుండుటయును – నేను లేచుటయును ॥దేవ॥
చరణము 1
నాకు దలపులు పుట్టినప్పుడే – నా మనసు గ్రహించినాడవు – ప్రాకటంబుగా నా నడక నా పడకను – పరిశీలించితివి ॥దేవ॥
చరణము 2
నీకు నా సమస్త చర్యల – నిజము తెలియును, మాట నాలుకకు – రాకపూర్వము దేవ సర్వము పూర్తిగ – నీకే తెలియును ॥దేవ॥
చరణము 3
నా వెనుకను ముందునుండి – నన్ను నావరించి నీ చేయి – నీవు నాపై నుంచితివి నా మది కిది – కేవల మందదు ॥దేవ॥
చరణము 4
అరుగుదెంచెద నెచ్చటికి నీ – యాత్మ యొద్ద నుండి యింక నీ – పరమ సన్నిధి నుండి నేను నెచ్చోటికి – బారిపోవుదు ॥దేవ॥
చరణము 5
ఏను వేకువ టెక్కలను ధరి – యించి కడలిలో నున్న నీ చేయి – మానక నడిపించి నీ కుడి చేయియు – మరి నన్ను గైకొను ॥దేవ॥
చరణము 6
నన్ను సృజించిన తెర గెరుంగగ – నాకు భయమాశ్చర్య మొదవును – గనుక నీకును నేను గృతజ్ఞతా స్తుతులను జెల్లింతును ॥దేవ॥
చరణము 7
నేను పిండంబైనయప్పుడు – నీవు నన్ను వీక్షించినాడవు – నేను బ్రతుకుట ముందే లిఖితమాయెను – నీ గ్రంథములో ॥దేవ॥
చరణము 8
నిక్కముగా దేవా నీ తలపు – లెక్కువ ప్రియమగును నాకును – లెక్కకు నెక్కువౌ ॥దేవ॥