#326
క్రీస్తును నమ్ముట
పల్లవి · Pallavi
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే – నమ్మితి నయ్యా యేసయ్యా – నమ్మితి నయ్య నా – నెమ్మదిలో నిన్ను – నిమ్ముగా కృప నాపై – గుమ్మరించుము వేగ ॥నమ్మితి॥
చరణము 1
పాప భారమనేడు – మోపు మోయగ లేక – కాపు నీవే యని నీ – దాపు జేరిన నేను ॥నమ్మితి॥
చరణము 2
ఆపత్కాలమునందు – ప్రాపు నీవని వేడ – గాపాడు రక్షించు – కరుణాసముద్రుడా ॥నమ్మితి॥
చరణము 3
ఎన్ని తప్పులు నాలో – నున్న నీ దయచేత – మన్నించి రక్షించు – మహిత దేవకుమార ॥నమ్మితి॥
చరణము 4
దాసుని మొర నీవు – వేసారక విని – వాసిగా రక్షించు – పరమ జనక నన్ను ॥నమ్మితి॥