#325

పాపి మరలుట

రాగం: ఖమాసు (ఛాయ: చేడియలు గుంపుగూడి) · తాళం: త్రిపుట · రచయిత: ముంగమూరి దేవదాసు

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
నన్ను దిద్దవయ్య చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా – నీవు – కన్న తండ్రి వనుచు నేను – నిన్ను జేరితి నాయనా ॥నన్ను॥
చరణము 1
దూరమునకు బోయి నీ దరి – చేర నైతిని నాయనా – నేను కారు మూర్ఖపు పిల్లనై – కాడు అడవిని దిరిగాను నాయనా ॥నన్ను॥
చరణము 2
మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా – నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా ॥నన్ను॥
చరణము 3
చాల మార్లు తప్పిపోతిని – మేలు గానక నాయనా – నా – చాల మొరలు నాలకించుము – జాలిగల నా నాయనా ॥నన్ను॥
చరణము 4
జ్ఞాన మంతయు పాడుచేసి – కాన నైతిని నాయనా నీవు – జ్ఞానము గల తండ్రి వంచు – జెప్పి వచ్చెను నాయనా ॥నన్ను॥
చరణము 5
కొద్ది నరుడను దిద్ది నన్ను నీ – యొద్ద జేర్చుము నాయనా – నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ॥నన్ను॥
చరణము 6
ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా – నీ – రెక్కె చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ॥నన్ను॥
చరణము 7
శత్రువగు సాతాను నన్ను – మిత్రుని చేసెను నాయనా – యెన్నో సూత్రములు గల్గించెను నా – నేత్రములకు నాయనా ॥నన్ను॥
చరణము 8
వాసిగ నే బాపలోకపు – వాసుండనో నాయనా – నీ – దాసులలో నొక్కనిగా నన్ను జేసి కావుము నాయనా ॥నన్ను॥