#324
పాప పశ్చాత్తాపము
పల్లవి · Pallavi
ఏ ముఖంబుతోడ వచ్చు – యేసునాథ నీదు మ్రోల – కావించి నిన్ను మరిచి – యేకమై పామరులతో – నేది దారి నిన్ను జేర – నేమో తెలియదాయెను ॥ఏ ముఖంబుతోడ॥
చరణము 1
నీచ పాప వర్తనంబు – పేచ మెల్లా బాపి ముందు – కాచి పెంచి నియమ నిష్ఠ – లాచరణము నిలుపుకొరకు – దోషభార మెల్లా బాప – బూనితివయ్య నిజముగా ॥ఏ ముఖంబుతోడ॥
చరణము 2
తుట్టతుదకు నిన్ను జేర – గట్టిగా నొండంగమునను – వట్టిమాట కాదు నిజము పట్టి – నడుపు పరమ పురికి – పట్టికొనుము నాదు చేయి – మట్టి పాలు కాకమునుపే ॥ఏ ముఖంబుతోడ॥