#323
క్రైస్తవ పశ్చాత్తాపము
పల్లవి · Pallavi
రావయ్య యేసు నాథా – మా – రక్షణ మార్గము – నీ – సేవ చేయు మమ్ము – జేపట్టుటకు ॥రావయ్య॥
చరణము 1
హద్దు లేక మేము – ఇల – మొద్దులమై యుంటిమి – మా – కొద్ది బుద్ధులన్ని – దిద్ది రక్షింపను ॥రావయ్య॥
చరణము 2
వేడుకతోను – మమ్ము – బెండ వడక చేసి – మా – గండంబు లన్నియు – ఖండించుటకు ॥రావయ్య॥
చరణము 3
మేర లేని పాప – మాకు – భారమైన మోపు – నీవు – దూరంబుగా చేసి – దారి జూపుటకు ॥రావయ్య॥
చరణము 4
పాపులమయ్యా మేము – పరమ – తండ్రిని గానకను – మా – పాపంబు లన్నియు – పారదోలుటకు ॥రావయ్య॥
చరణము 5
అందమైన నీదు – పరమానంద పురమందు