#322

క్రీస్తు మోక్ష మార్గము

రాగం: ఆనందభైరవి (ఛాయ: దేవుని ప్రేమ ఇదిగో) · తాళం: కురుఝంపే · రచయిత: మిక్కిలి సమూయేలు

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
శరణు నా యేసు ప్రభువా – నీవేగా – పరలోకమునకు ద్రోవ – కరుణతో నన్ను గావ – నీ కన్న గర్త యెవ్వడు యేసువా ॥శరణు॥
చరణము 1
పర సుఖము విడిచినావు – కన్యక – మరియ గర్భమున నీవు – ధరణి నుదయించినావు – నీ కన్న – దాత యెవ్వడు యేసువా ॥శరణు॥
చరణము 2
పాపభారము క్రిందను – పడి యున్న – పాపాత్ములను నెల్లను – జేపట్టి రక్షింపగా – నీ కన్న – శ్రేష్ఠుడు ఎవ్వడు యేసువా ॥శరణు॥
చరణము 3
మరణమై లేచినావు – జీవింప – మార్గంబును జూపినావు – పరమహిమ జూపినావు – నీ కన్న – ప్రభుడు ఎవ్వడు యేసువా ॥శరణు॥