#321
పాపి విలాపము
పల్లవి · Pallavi
ఆదరింపుము యేసువా ని – న్నాశ్రయించితి నా కింకన్ లేదు వేరొక యాశ్రయంబని – లెస్సగా మది నమ్మితిన్ ॥ఆదరి॥
చరణము 1
నిరతముండు పరమ ధనమను – నీతి జీవిత రీతిలో – పెరుగు గోరుచు నిన్ను జేరితి – బ్రేమ చూపుము యేసువా ॥ఆదరి॥
చరణము 2
సత్య సంధుడు లోక బాంధవ – సర్వశాంతి సుధాకర – నిత్యజీవ జలమ్ము లొసగుము – నీతి నిధుల సజీవుడా ॥ఆదరి॥
చరణము 3
ముందు వెనుకను దుష్ట శక్తుల – మూక నన్ను గట్టగన్ – బంధితుండనైతి నా ప – ద్బాంధవ విడిపించుమా ॥ఆదరి॥
చరణము 4
పరమ పురమున కరుగ నేరని – పాద దాసుడనో రక్షకా – కరుణతో నా మొరను గైకొని – కలుషములను ఎడబాపవే ॥ఆదరి॥
చరణము 5
పరమ ధాముడవని యెరిగి నీ – శరణు వేడితి నో ప్రభో – తనువు విడిచిన వేళలో నీ – తలుపు నాకు తెరువుమా ॥ఆదరి॥