#320

పశ్చాత్తాప ప్రేరేపణ

రాగం: బిలహరి (ఛాయ: భీకరుండై) · తాళం: త్రిపుట · రచయిత: డేవిడ్ లైటన్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు విభుని దలచి మదిలో – ద్వేషము లణగింపరే – మోస విశ్వ భ్రాంతులు ఎల్లా – రోసి పరిహరింపరే ॥యేసు॥
చరణము 1
కామ క్రోధ లోభ మోహ – క్షామ గుణములు మానరే – హేమ రీతిని దేవ కృపలో – క్షేమ మున్నది కానరే ॥యేసు॥
చరణము 2
సత్యవేద సార మెల్లా – నిత్యము రుచిచూడరే – సత్త లేని దురిత జాలి – బొత్తిగా విడనీయరే ॥యేసు॥
చరణము 3
కర్త కర్తయనుచు వేడి – వ్యర్థులై చెడిపోకరే – స్వార్థ చర్య లెల్ల మాని – కర్త యేసుని బోలరే ॥యేసు॥
చరణము 4
బంధు మిత్రు – శత్రు నెనరు – నిందు జూప బాడరే – యందమైన మోక్ష విభవము – లందు గని సమర్పింపరే ॥యేసు॥
చరణము 5
మోక్ష వైభవ మెదలోన దలచి – మోసమున బడిపోదురే – కక్షి సాతాన్ ముచ్చు వలలను – హెచ్చుగా నెగ గొట్టరే ॥యేసు॥
చరణము 6
సదు లోకమున దేవ సేవ – ముదుటి తో కొని యాడరే – హద్దు మీరి విమత సాతాన్ – సుద్దులను ద్యజింపరే ॥యేసు॥
చరణము 7
బాధ చేసెడి గురువుల వీడుచు – బోధకుల దరి జేరరే – నాథు క్రీస్తును నమ్మి మీరలు – సాధులై వర్తింపరే ॥యేసు॥