#319

ఆత్మ వంచన

రాగం: ధన్యాసి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎరిగి యెరిగి చెడిపోతివి మనసా – యింక నీ దిక్కెవరో చెప్పుమా – దురితమని స – చ్చరితమని యెరుక సరకు గొన – కేమియు నీ ॥యెరిగి॥
చరణము 1
ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ – మిది విమలాత్ముని గుణమనుచు – ఎదలో ననుభవ – మెరిగి మరల దు – ర్మదమున దుష్కృత – పదమున బడితివి ॥యెరిగి॥
చరణము 2
సకలము జూచు దేవుని కంటికి – జాటుగ జరిగెడి పని యేది – ఇంక జెవి గుసగుస – లెల్లను దిశల బ్రకటము జేసెడు – ప్రభువున్నాడని ॥యెరిగి॥
చరణము 3
ఎన్నిమార్లు సిలువను వేయుచు ప్రభు – యేసుని వెతల బెట్ట జేసెదవు – తిన్నని మార్గము – తెలిసియుండి నీ – కన్నుల గంతలు – గట్టితివయ్యో ॥యెరిగి॥
చరణము 4
గద్దించెడు మనస్సాక్షికి గడ – గడ లాడక పోతివి నీవు – హద్దుమీరి దై – వాజ్ఞలు ద్రోయుచు – నెదురు లాగు పరు – గెత్తితివయ్యో ॥యెరిగి॥
చరణము 5
పలువిధ శోధన బాధలలో ఘన – प्रभु క్రీస్తుడే నీ దిక్కును కోరు తాళుచు బశ్చాత్తాపపడి యిక – జాలించుము కలు – షపు ప్రయత్నంబు ॥యెరిగి॥
చరణము 6
అపరిమిత దయా శాంతులు గల ప్రభు – వనిశము కోపించెడు నీపై – కృపా వాగ్దత్తము – లెప్పుడు దలచి నీ – యపవిత్రతను గని – హా యని యేడువుము ॥యెరిగి॥