#318

పాపపు టొప్పుకోలు

రాగం: హరికాంభోజి · తాళం: త్రిపుట · రచయిత: బేతాళ జాన్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పాపినయ్యా – నేను – బాపినయ్యా – కాపాడుమయ్యా – పాపభారమునుండి – పాపుమయ్యా – నన్ను – పాపభారమునుండి – పాపుమయ్యా ॥పాపిని॥
చరణము 1
కావుమయ్యా – నన్ను – గావుమయ్యా నా – పావనయ్యా – జీవమైన యేసు – నీవేనయ్యా నా జీవమైన యేసు – నీవేనయ్యా ॥పాపిని॥
చరణము 2
ప్రాపు నీవు – నా ప్రాపు నీవు న – నోప్పినావు – నా పాలిదేవమా – నన్ను గావుమో – నా పాలి దేవమా – నన్ను గావు ॥పాపిని॥
చరణము 3
ఏలవయ్యా – న – న్నేలవయ్యా – మేలయ్యవయ్యా – చాల నమ్మితిని గరుణా – శాలివయ్యా – నేను – జాల నమ్మితిని గరుణా – శాలివయ్యా ॥పాపిని॥
చరణము 4
మంటివాడు – నేను – మంటివాడను – నొంటి వీడ కె – న్నంటికైనా – నంటువాడు – నేను నేను – నంటికైనా – నంటువాడు ॥పాపిని॥
చరణము 5
శాంతిపరచు – నన్ను – శాంతిపరచు నీ – శాంతమిడుచు నా – సొంతమగు దనుకు – చెంతనుంచుము – నేను నా – శాంతమగు దనుకు – చెంతనుంచుము ॥పాపిని॥