#312
The Great Physician
పల్లవి · Pallavi
మహా వైద్యుడు వచ్చెను ప్రజాళిని బ్రోచు యేసు సహాయ మియ్య వచ్చెను సంధింపరండి యేసుకన్.
చరణము 1
॥మాధుర్యంపు నామము – మోదమిచ్చు గానము వేద వాక్య సారము యేసు దివ్య యేసు॥
చరణము 2
మీ పాపమెల్ల బోయెను మేలొందుడి యేసు పేరన్ కృపా సంపూర్ణ మొందుడి.వినుండు గొర్రెపిల్లను విశ్వాసముంచి యేసుకన్ ఘనంబుగాను స్తుతించుడి మనంబుప్పొంగ యేసుకన్.ఆ రమ్యమైన నామము అణచునెల్ల భీతిని శరణ్యులైన వారి నా ధరించు నెంతో ప్రీతిన్.ఓ యన్నలారా పాడుడి యౌదార్యత్వమున సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కండి ప్రియాతి ప్రియుడేసుని.ఓ పిల్లలారా కొలువుడి యున్నత్య రాజు నేను సవరించు వారి దాతయై దయామయుండు శ్రీ యేసు శ్రీ యేసుకై అర్పించుడి మీ యావజ్జీవమును ప్రియంపు దాసులౌచును రయంబు గొలువుడేసుకన్.— విలియం హంటర్ (అను: ఆల్‌ఫ్రెడ్ త్యాగరాజు పామర్)