#310
యేసు హృదయ ద్వారమును తట్టుట
పల్లవి · Pallavi
హృదయమనెడు తలుపు కడ – యేసు నాథుండు – నిలచి – సదయుడగుచు తట్టుచుండు – సకల విధములనూ ॥హృదయమనెడు॥
చరణము 1
పరుని బోలి నిలుచుచున్నాడు – పరిశీలించి చూడు – నతడు – పరుడు గాడు రక్షకుడు – ప్రాణ స్నేహితుడు ॥హృదయమనెడు॥
చరణము 2
కరుణాశీలు డతడు గాన – గాచి యున్నాడు – యేసు – కరుణ నెరిగి గౌరవింప – గరము న్యాయంబు ॥హృదయమనెడు॥
చరణము 3
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని – నత – డెంతో దయతో బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను ॥హృదయమనెడు॥
చరణము 4
అతడు మిత్రుడతడు మిత్రు – డఖిల పాపులకు – మీరు – లతని పిలుపు వింటిరేని – యతడు – ప్రియుడగును ॥హృదయమనెడు॥
చరణము 5
జాలితోడ దన హస్తముల – చాపి యున్నాడు – మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు ॥హృదయమనెడు॥
చరణము 6
సాటిలేని దయగలవాడు – సర్వేశ సుతుడు – తన – మాట వినెడు వారల కెల్ల – సూటిగ రక్షించు ॥హృదయమనెడు॥
చరణము 7
చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాథు – నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చిర జీవమును గృపను ॥హృదయమనెడు॥
చరణము 8
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు – మీరు – లతని హత్తుకొందు రిప్పు – డీనందముతోడ ॥హృదయమనెడు॥
చరణము 9
బ్రతుకు శాశ్వతంబు గాదు – పరిశీలించి చూడు – గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలవండి ॥హృదయమనెడు॥