#303
కాలము గతించిపోవుచున్నది
పల్లవి · Pallavi
పోయెనగా పోయెనగా – కాలము వెళ్ళి – పోయెనగా పోయెనగా – మాయా సంసార సం – పదన గూర్ప మరిగి – యా యావంతయు వ్యర్థ – మై పోయెన దరిగి ॥పోయెనగా॥
చరణము 1
ఇలలో నెందరు నీతో – నీడైనవారు – కల గని మేల్కొనిన – గతి మడిసినారు ॥పోయెనగా॥
చరణము 2
జల బుద్బుదము కంటె – చులకని బ్రతుకు – తలపోసి దీన్ని యా – శలు గొయ్యి వెదకు ॥పోయెనగా॥
చరణము 3
ఎన్నాళ్ళు సుఖ పెట్టి – నెరవౌ నీ మేను – కన్ను మూసిననాడె – కాటి పాలౌను ॥పోయెనగా॥
చరణము 4
మద మత్సరముల వెంబడి గూడి నీవు – హృదయాభిమానము – వదలుకొన్నావు ॥పోయెనగా॥
చరణము 5
చెడు దుర్గుణముల పో – షించుట విడువు – గడబాటుల నీ కన్నులు – గానం గలవే ॥పోయెనగా॥
చరణము 6
జవ్వన బలముచే – క్రొవ్వుచు నీవు – నవ్వులాటల ప్రొద్దు – నడిపి యున్నావు ॥పోయెనగా॥