#302
శుభవార్తమాన ప్రకటన
పల్లవి · Pallavi
యేసుని సుచరిత – మెంత పొనరినది – యెవ్వరు విన యెద – రి జగత్తునన్ భాసుర నయమను – బంధము గలిగిన – భక్తుల హిత సౌ – భాగ్యముగా ॥యేసుని॥
చరణము 1
దాసుల మొరలను – దప్పక వినుచును – ధైర్యము లొసగెడి – దాత సుమీ – దోషము గవిమి – ద్రోయ బలాము గల – దొడ్డ దొరకు నుతి – దూతల చేన్ ॥యేసుని॥
చరణము 2
పాప నరుల గని – పావనమొనర్చను – భారమునని ఘన – బంధువుడు – ఆ పరమ జనకు – నాజ్ఞల బడసి నెరి యా – డెడి యిలను ॥యేసుని॥
చరణము 3
సిలువపై నిలిచి – చేటు వడుచు మరి – చివరకు జనకుని – చిత్తమునన్ – చెలువగ మనవి – జేసెను నరులకు శిక్ష తొలగుటకు – నాకరుడు ॥యేసుని॥
చరణము 4
పాప రహిత యఘ – పారమహిమమున – పాత్రమ మరి కుడి – పార్శ్వమునన్ – పాపుల విషయము – ప్రార్థన మొనర్చెడి – భావము గల హిత – భాస్కరుడు నా ॥యేసుని॥
చరణము 5
దుష్టులు నన్ను గని – దూషణ నుడువులు – దగవుల ననక – దూరిన నా – ఇష్టుడు వడసిన యిడుములు దలచి – యుంచుక పగ మది