#304
రక్షణ మార్గము
పల్లవి · Pallavi
వినరే యేసు క్రీస్తు బోధ – మనసున – గొనరే – యాతని సత్య బోధ – వినని యేసుని బోధ – విశ్వాసమున మీరు – గొనయెదరు నిజముగా – గొప్ప భాగ్యంబులు ॥వినరే॥
చరణము 1
దారి దొలగియున్న – వారి నెల్లను బ్రోవన్ – గోరి వచ్చితి నంచు – కూర్మి యేసువు తెల్పె ॥...వినరే॥
చరణము 2
మన పాపముల నెల్ల – మన కొరకు వహియించి – మన యందు దయచేత దన – ప్రాణమర్పించి ॥వినరే॥
చరణము 3
మారు మనసు నొంది – మరల రమ్మంచును – మారు బిలుచు యేసు – మైత్రిని దలచుచు ॥వినరే॥
చరణము 4
తన యాజ్ఞ గైకొని – తన సేవ చేసెడి – మనుజుల కొసంగును – మనసున నెమ్మది ॥...వినరే॥
చరణము 5
తాను నడచిన త్రోవ – తన జనులు ద్రొక్కును – తా నెప్పుడు చేయును – తగిన సహాయంబు ॥వినరే॥