#3

యేసు సహాయమునకై ప్రార్థన

రాగం: మాళవ (ఛాయ: తనువు నాదిదిగో) · తాళం: ఆది · రచయిత: గొల్లపల్లి నతానియేలు

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు నాయకుడా యెల్ల వేళలనునీ దాసుల నేలుమయ్యా మోసములఅన్నిటిమునగ ద్రోతునని బాసలు జేసినప్రభుడవు నీవెగా ॥యేసు॥
చరణము 1
రేయింబగలు మా న్యాయము చెరిపెడిమాయా పిశాచిని ద్రోయుమి దూరముబాయక భక్తుల జేరు విడువనిబహు శ్రేష్ఠుడవు నీవెగా ॥యేసు॥
చరణము 2
హృదయము లోకము మది పాపము మమ్ముసతతము శ్రమ పెట్టును సదయుడమమ్మును వదలక నిత్యము మదితలపులలో మహిమగ నేలుమీ ॥యేసు॥
చరణము 3
కాపాడుమి మమ్ము మాపు రేపు నీశ్రీ పాదములొద్దను ఏ పాపములునుఏలకుండగ నీ ప్రాపున బెంచుముమాపాలకుడవు ॥యేసు॥
చరణము 4
మా కొరకై నీ మేనును మ్రానునమేకులతో గొట్టగ మానము మహిమలుమనుజుల కియ్యను భానుడ రాజుగబ్రతికి లేచితివి ॥యేసు॥
చరణము 5
చేను చేనుగా మరి పుట్టుక నీవుపరమున కిలితివి వరముల నిచ్చితివిధరణిలో నరులకు పరముడ నీ దయమరువ శక్యమా ॥యేసు॥