#2

దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు

రాగం: ఆనందభైరవి (ఛాయ: యెహోవా భజన) · తాళం: త్రిపుట · రచయిత: విలియం డాసన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
గానము చేయుడి సుకీర్తననుయెహోవాను గూర్చి క్రొత్త గానమురక్తిగను ॥గానము॥
చరణము 1
తన నామమును నుతించి యతనిరక్షణ జెన్నుగ సాటెడి ప్రసిద్ధముజేసి పన్నుగ నన్యులలో దన మహిమయందున్నత చిత్రములను చాటండి ॥గానము॥
చరణము 2
ఘనతయు మహత్త్వమును దన యెదుటనుండుఘనబలమును వినతము సౌందర్యమునునతని పరిశుద్ధ స్థలమున విలసిల్లు ॥గానము॥
చరణము 3
పరిశుద్ధాలంకారముతో నాతనిపరమాత్మారాధన పరులై యుండండిధరణి సకల జనులారా లోకగురుని యెదుట విధి గొనుచునుండండి ॥గానము॥
చరణము 4
పరిపాలించుచున్నాడనుచు తోడినరులతో జెప్పండి ధరణి గదలకుండస్థిరముగ జేయు సత్యముగా జనులకిరమురిగాను న్యాయము విమర్శించు ॥గానము॥
చరణము 5
ఏమనిన నా మహత్ముండు వచ్చునీ మహికి న్యాయము నేర్పరచుటకుభూమి జనులకు నీతి సత్యములతో మించు న్యాయమెంతో విమర్శించు ॥గానము॥
చరణము 6
జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము చేయండివినయముతో గానుకలను తీసికొని తత్ప్రకారమందున వసియింపండి ॥గానము॥