#1

సృష్టికర్త ప్రస్తుతి

రాగం: కాంభోజి · తాళం: ఆట · రచయిత: బేతాళ జాన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
అన్ని కాలంబుల నున్న యెహోవా నినెన్నదరంబయ్యో కన్న తండ్రిమన్నెనెక్కిన మోక్షవాసాల సన్నుతులున్నతమై యుండ మున్నె నీకు ॥అన్ని॥
చరణము 1
నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములనుబన్నుగ జేసిన బలుడ వీవెఉన్న లోకంబుల నుడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడ వీవె ॥అన్ని॥
చరణము 2
నీవె అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచునున్న సర్వజ్ఞుడవు నీవెఎన్న శక్యముగాక యున్న లక్షణములసన్నుతించుటకు నే జాలదూరను ॥అన్ని॥
చరణము 3
పుట్టించి మమ్మీవు పెంచి పోషించి మమ్మీగిట్టించి మమ్మీవు త్రిప్పితివనుచునట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప నీ బాధ్యుండవంచుదట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చిపట్టరై నిలిచియుందు ప్రభుడ వీవెగట్టెడి కట్టచే గెడముట్టదనుకొనకపట్టుకొలది నిన్ను ప్రస్తుతింతు ॥అన్ని॥
చరణము 4
కారుణ్యనిధి వీవు కీడు నాథుడను నేనుభూరి శుద్ధుడవు నీవు పాపి నేనుసార భాగ్యుడవు నీవు జగతి లో నాకన్నదారిద్రుడే లేడు తరచి చూడసార సద్గుణముల సంపన్నుడవు నీవుఘోర దుర్గుణ సంచారి నేనుఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతునేరమెన్నక ప్రోవ నెర నమ్మితి ॥అన్ని॥