#294
క్రీస్తుని గొప్పతనము
పల్లవి · Pallavi
యేసునే సేవింప రండి – మోసపోకండి – ప్రభు – దోషములను బాపు నండి – పెద్ద ప్రభువుండీ ప్రభు ॥యేసునే॥
చరణము 1
దేవు డీతడే సుమండీ – దిగులుపడకండీ – మన – చావు నొంది లేచెనండీ – జీవ మిత్రుడండీ ప్రభు ॥యేసునే॥
చరణము 2
పాపులను ప్రేమించెనండీ – ప్రాణ మిచ్చెనండీ – ప్రభు – దాపు జేరి వేడ రండి – దయామయుడండీ ప్రభు ॥యేసునే॥
చరణము 3
నరకబాధ నొందెనండీ – నరుల కొరకండీ – ప్రభు – దురితములను బాపు నండి – దుఃఖపడకండీ ప్రభు ॥యేసునే॥