#293
పాపుల స్నేహితుడు
పల్లవి · Pallavi
పాపులకు సఖుడు – మన ప్రాపు యేసే సుమండీ – భువి – పాపులకు సఖుడు ॥పాపులకు॥
చరణము 1
రండి రండి మిత్రులారా – నిండు ధైర్య పడండి వేగమే – దండిన యండ మనకుండు యేసుండని ॥పాపులకు॥
చరణము 2
దాహమణచు దేవ వాక్యము – దేహధారులారా రండి – దేహి యన విహీనుల – సహాయ్యము నోహో యని ॥పాపులకు॥
చరణము 3
ద్రవ్య మించుక లేని విక్రయ – మయ్య యీ యేసయ్య రక్తము – చేయలే మయ్య మన – మయ్య దుర్నయములు ॥పాపులకు॥
చరణము 4
నిండు మనసు గలిగి యే – సండ జేర రండి వేగమే – నిండు ప్రియుడు న – యండ పురుషుండని ॥పాపులకు॥
చరణము 5
నింద లన్ని పొంది ప్రభుని – మందలో వెలుగొందు రే తరిని – పొందుగ నిందలో