#292
పాపము సార్వత్రికము
పల్లవి · Pallavi
నిజముగా పరిశుద్ధుడొక్కడు – నేలపై లేడు – మాలిన్యములచే బడిన మదిని బ – విత్రము జేయుట యెట్లు బొడమును ॥నిజము॥
చరణము 1
దురిత లతలకు మూలకందము – దుస్స్వభావము దాన్ని గూడిన – నరులలో బరిశుద్ధ విధులు – లెన్నటికిని గనరావు – నెరవుగా సద్ధర్మములను దేటగా నొనరింప నేర్తురు – ధరణి లోపల ముసిడి చెట్టున – చెరకు రసముండునా తలంపగ ॥నిజము॥
చరణము 2
మనసు క్రియలన్నిటికి మూలం – బనుచు శాస్త్రము పల్కు మరి యా – మనసు శుచిగాకున్న నగునే – తనకు క్రియల శుద్ధి – అనిశము మా హృదయము దురిచ్ఛల – నలరి మిథ్యాశక్తి నుండగా – ఘనతగల సత్యార్యముల నిల – మనుజుడెట్లాచరింపజాలును ॥నిజము॥
చరణము 3
నిరతమును పాపాగ్ని చేతను – గరుగుచున్న మనంబు లోపల – పరమ ధర్మము భక్తి ఎటువలె – పాదుకొని యుండును – నిరపరాధి యొక్కడు లేడని – నిక్కముగా గనవచ్చుచున్నది – పరమ దేవుడు క్రీస్తు కృతమున – పాపులను రక్షింపవలయును ॥నిజము॥