#29
ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
పల్లవి · Pallavi
పాహి లోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యనివేడెదము మాం పాహి లోక ప్రభో ॥పాహి॥
చరణము 1
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుడవు అనిచెన్నుమీరగా నమ్మి యున్నాము సత్ప్రభు ॥పాహి॥
చరణము 2
నిత్య మా తండ్రి భూ లోకం బంతయు నిన్నుభక్తితో నారాధించుచున్నది మా ప్రభో ॥పాహి॥
చరణము 3
దేవ లోకాధిపతులు దూతల సమూహముదేవా యని కొల్చుచున్నారు నిన్ను ప్రభు ॥పాహి॥
చరణము 4
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువాపరలోక సేనాధిపతివైన మా ప్రభో ॥పాహి॥
చరణము 5
ఇహ లోకం బంతయు పరలోకం బంతయు నీమహిమ మహాత్మ్యముతో నున్నవి ప్రభో ॥పాహి॥
చరణము 6
కెరూబులను దూతలు సెరాపులను దూతలుస్థిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో ॥పాహి॥
చరణము 7
నీ దైవభక్తుల మహిమగల సంఘముప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
చరణము 8
నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘముసత్యముగా నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
చరణము 9
ధీర హతసాక్షుల వీర సైన్య మంతయుసారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో ॥పాహి॥
చరణము 10
నిత్య మహాత్మ్యముగల తండ్రివైన నిన్నునునీదు పూజ్యుడగు నిజ అద్వితీయ సుతునికన్ ॥పాహి॥
చరణము 11
ఆదరణకర్తయై నట్టి శుద్ధాత్మనునంతటనుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభు ॥పాహి॥