#28
దేవుని మహిమ
పల్లవి · Pallavi
మహిమ సర్వోన్నతమైన దైవమునకుమహి సమాధానానుగ్రహము గల యోగ్యప్రభు ॥మహిమ॥
చరణము 1
నిన్ను స్తోత్రించుచు నిన్ను పూజించుచు నిన్నుమహిమ పరచుచున్నాము లోక ప్రభు ॥మహిమ॥
చరణము 2
ప్రభువైన దేవుండా పరమండలపు రాజాప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ॥మహిమ॥
చరణము 3
వినయంబుతో నీదు ఘన మహిమార్థమైవందనము లర్పించి వినుతింతుము సత్ప్రభు ॥మహిమ॥
చరణము 4
జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభుదేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభు ॥మహిమ॥
చరణము 5
ధరణి పాపముల మోయు వరపుణ్య శీలుండాకరుణించి మా మీద మొరలాలించుము ప్రభో ॥మహిమ॥
చరణము 6
తండ్రియైన దేవుని దక్షిణ భాగమున గూర్చుండి యున్నావు కృప చూపుము సత్ప్రభు ॥మహిమ॥
చరణము 7
పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవేదురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ॥మహిమ॥
చరణము 8
పరమ జనకుని మహిమన్ పరిశుద్ధాత్మైక్యంబైసరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ॥మహిమ॥