#27

దైవ స్తుతి

రాగం: బిలహరి · తాళం: త్రిపుట · రచయిత: వీరుప్పల మోషే

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగునునత్యున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానంనరుల కాయన దయ ॥కలుగును గాక॥
చరణము 1
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలాపరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచుమరి పొగుడుచున్నాము ॥కలుగును గాక॥
చరణము 2
మహిమ పరచుచు నారాధించుచున్నాము నిన్నుమహిమాతిశయమును మది దలంచియు నీకు మహినిమా స్తుతి कृतజ్ఞత ఇచ్చుచున్నాము ॥కలుగును గాక॥
చరణము 3
ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయాలోక పాపము మోయు ఏక దేవుని గొర్రెపిల్లమమ్మును కనికరింపుము చల్లగా ॥కలుగును గాక॥
చరణము 4
లోక పాపములు మోయుచు బోవు యేసు రక్షకావాసిగ జనకుని కుడివైపున గూర్చుండి యేసూమా ప్రార్థన లాలించి కనికరింపుము ॥కలుగును గాక॥
చరణము 5
పరిశుద్ధుడవు ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తూపరిశుద్ధాత్మతో తండ్రియైన దేవుని యందుపరిపూర్ణ మహిమతో బ్రాలుచున్న మా ఆమేన్ ॥కలుగును గాక॥