#26
95వ దావీదు కీర్తన
పల్లవి · Pallavi
రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ॥రండి॥
చరణము 1
రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదముసత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ॥రండి॥
చరణము 2
మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యముగల రాజుభూమ్య గాధపు లోయలను భూధర శిఖరము లాయనవే ॥రండి॥
చరణము 3
సముద్రము సృష్టింజె నాయనదే సత్యుని హస్తమే భువి జేసెన్ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలము ॥రండి॥
చరణము 4
ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదముఆయన మాటలు గైకొనిన నయ్యవి మన కెంతో మేలగును ॥రండి॥
చరణము 5
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాకఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్ ॥రండి॥